• facebook
  • whatsapp
  • telegram

TS INTER:  తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!

9,28,262 మంది పరీక్షలకు హాజరుకాగా.. 5,90,327 మంది ఉత్తీర్ణత 

 

 

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు.

 

ఇంటర్‌ మొదటి సంవత్సరం..

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,64,892

ఉత్తీర్ణత సాధించినవారు: 2,94,378

ఉత్తీర్ణత శాతం: 63.32 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,33,210

ఉత్తీర్ణత సాధించినవారు: 1,68,692

ఉత్తీర్ణత శాతం: 72.33

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,31,682

ఉత్తీర్ణత సాధించినవారు: 1,25,686 

ఉత్తీర్ణత శాతం: 54.20 శాతం

 

ఇంటర్‌ రెండో సంవత్సరం..

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,63,370

ఉత్తీర్ణత సాధించినవారు: 2,95,949

ఉత్తీర్ణత శాతం: 67.82 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,16,389

ఉత్తీర్ణత సాధించినవారు: 1,64,172

ఉత్తీర్ణత శాతం: 75.86

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,19,981

ఉత్తీర్ణత సాధించినవారు: 1,31,777

ఉత్తీర్ణత శాతం: 60 శాతం

ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.