• facebook
  • whatsapp
  • telegram

Telugu Versity: తెలుగు వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

 

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ, ఎంఫిల్‌లతో పాటు 2021-22 సంవత్సరానికి సంబంధించిన అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును పెంచినట్లు వర్సిటీ విద్యాత్మక విభాగం పీఠాధిపతి ఆచార్య రెడ్డి శ్యామల తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.100 ఆలస్య రుసుం చెల్లించి నవంబరు 2లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్‌సైట్‌లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

Posted Date : 27-10-2021