ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాల కోసం మార్చి 23 నుంచి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు ప్రారంభంకాగా తొలిరోజే అభ్యర్థుల నుంచి స్పందన కనిపించలేదు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ కేటగిరీల్లో 128 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా.. 88 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలోనూ 38 మందే రెగ్యులర్ విధానంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. నిబంధనల ప్రకారం రోస్టర్ పాయింట్ల ఆధారంగానే నియామకాలు జరగాలి. దీని ప్రకారం కొన్ని పోస్టులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి తలెత్తింది. సాధారణంగా జనరల్ మెడిసిన్ పోస్టులకు డిమాండ్ ఉంటుంది. 74 పోస్టులకు 38 మంది అభ్యర్థులు రాగా.. వీరిలో 19 మందే విధుల్లో చేరేందుకు మొగ్గుచూపారు. జనరల్ సర్జరీ పోస్టులు 39 ఉండగా 40 మంది దరఖాస్తుచేశారు. వీరిలో 14 మంది నియామకపత్రాలు అందుకున్నారు. డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఏడు, రెండు, ఆరు చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో మూడు, ఒకటి, ఒకటి చొప్పున మాత్రమే భర్తీ అయ్యాయి. ఒప్పంద విధానంలో చేరేందుకు ఆసక్తి కనబరిచిన మరో 17 మందికి మార్చి 24న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వీరిలో ఎంతమంది విధుల్లో చేరేందుకు ముందుకొస్తారన్నది సందేహమే. మొత్తంగా 319 పోస్టులను 14 కేటగిరీల్లో భర్తీచేసేందుకు మార్చి 27వ తేదీ వరకు విజయవాడ పాత ఆసుపత్రిలోని డీఎంఈ కార్యాలయంలో ఈ వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు, డిసెంబరులో కలిపి రెండుసార్లు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీని ప్రకారం 70 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండాలి. కానీ ఈ సంఖ్య ప్రస్తుతం 319 వరకు చేరింది. ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరడంలేదు. చేరిన వారు నిలకడగా ఉండటంలేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్
‣ సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్ పోస్టులు
‣ మేనేజర్లకు టూరిజం స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.