ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖలోని అన్ని పథకాలు, కార్యక్రమాల అమల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఓ ప్రకటనలో మే 23న ఆదేశించారు. తన పరిశీలనలో ఈ జిల్లాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు గ్రహించానని పేర్కొన్నారు. విద్యా కానుక కింద ఇచ్చే ఏకరూప దుస్తులు, బూట్లు, పాఠ్యపుస్తకాలు, చిక్కీలు, కోడిగుడ్లు, శానిటరీ న్యాప్కిన్స్, ‘నాడు-నేడు’లోని బెంచీలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, స్మార్ట్, ఐఎఫ్పీ ప్యానల్స్ తదితరాలను ముందుగా ఈ జిల్లాలకు అందించిన తర్వాతనే ఇతర జిల్లాలకు సరఫరా చేయాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.