• facebook
  • whatsapp
  • telegram

JOSAA: ఐఐటీ హైదరాబాద్‌, తిరుపతి నుంచి మారిన టాప్‌ ర్యాంకర్లు

* జోసా రెండో రౌండ్‌ సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ఏడు పాత ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో చేరిన విద్యార్థులు జోసా రెండో రౌండులో ఒక్కరు కూడా అక్కడి నుంచి కదల్లేదు. అంటే అక్కడ ప్రవేశాలకు ప్రారంభ, ముగింపు ర్యాంకులు మారలేదు. మిగిలిన ఐఐటీల్లో కొంత మారింది. ఐఐటీ బాంబే రెండో విడత సీట్లను సెప్టెంబ‌రు 28న‌ సాయంత్రం కేటాయించింది. ఐఐటీ హైదరాబాద్‌లో తొలి విడతలో సీఎస్‌ఈ ఓపెన్‌ కేటగిరీ జెండర్‌ న్యూట్రల్‌లో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 346, 585 ఉండగా... రెండో రౌండుకు ప్రారంభ ర్యాంకు 368కి మారింది. అంటే కొందరు టాపర్లు ఇతర ఐఐటీల్లోకి మారిపోయినట్లు స్పష్టమవుతోంది. ఐఐటీ తిరుపతిలో కూడా ప్రారంభ ర్యాంకు 1313 నుంచి 1333కి, ముగింపు ర్యాంకు 3,746 నుంచి 3,764కు చేరింది. ఇక్కడా టాపర్లు కొందరు ఇతర ఐఐటీల్లోకి వెళ్లిపోయారు. మరో నాలుగు విడతల కౌన్సెలింగ్‌ జరగనుంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.