• facebook
  • whatsapp
  • telegram

Reservations: గిరిజన రిజర్వేషన్లు ఇక 10 శాతం

* విద్య, ఉద్యోగాల్లో తక్షణ అమలు

* ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

* 64 శాతానికి చేరిన రిజర్వేషన్లు


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబ‌రు 30న‌ అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సి-1, డి-7, ఇ-4) 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. సీఎం సెప్టెంబ‌రు 30న‌ ప్రగతిభవన్‌లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆమోదం తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.