• facebook
  • whatsapp
  • telegram

TS Constable Exam: కానిస్టేబుళ్ల రాత పరీక్ష 28కి వాయిదా

* 18 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

 

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆగస్టు 21వ తేదీన జరగాల్సిన కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్ష ఇదే నెల 28వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆగస్టు 8న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 మంది కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించి నియామక మండలి గత ఏప్రిల్‌ నెలలో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సై ఉద్యోగాలకు ఆగస్టు 7వ తేదీన పరీక్ష నిర్వహించగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇదే నెల 21వ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ముందు ప్రకటించారు. పరిపాలనాపరమైన సమస్యల కారణంగా ఆగస్టు 28కి వాయిదా వేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హాల్‌టికెట్లను ఆగస్టు 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నియామక మండలి ఛైర్మన్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

 

స్టడీమెటీరియల్
 

మ్యాథమెటిక్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
బయాలజీ
పాత ప్రశ్నప‌త్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.