• facebook
  • whatsapp
  • telegram

TS Education News: తెలంగాణ విద్యా సమాచారం

10Th Class Results: జూన్‌ 30న ‘పది’ ఫలితాలు 

* విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబిత

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్‌ 30న విడుదల కానున్నాయి. అందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లో జూన్‌ 30 ఉదయం 11.30 గంటలకు మంత్రి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలను www.eenadu.net, eenadupratibha.net, bse.telangana.gov.in, bseresults.telangana.gov.in  తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. జూన్‌ 2తో ముగిసిన పరీక్షలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.

జులై 1న టెట్‌ ఫలితాలు: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు జులై 1న విడుదల కానున్నాయి. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్‌ 12న పరీక్ష జరగ్గా...నోటిఫికేషన్‌లోనే 27న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజున ఫలితాలు విడుదల కాలేదు. ఈ క్రమంలో తన కార్యాలయంలో మంగళవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా ఒకటో తేదీన విడుదల చేయాలని ఆదేశించారు. 

 

DOST Schedule: జూన్‌ 29న దోస్త్‌ కాలపట్టిక వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది. ఇంటర్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో దోస్త్‌కు సంబంధించి ప్రవేశాల కాలపట్టికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం జారీ చేయనుంది.

 

IFS Results: అటవీ కళాశాల విద్యార్థికి ఐఎఫ్‌ఎస్‌లో 86వ ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అటవీ కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థి కె.రాజు జూన్‌ 28న యూపీఎస్సీ ప్రకటించిన ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో 86వ ర్యాంకు సాధించారని అటవీశాఖ తెలిపింది. జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన రాజు మొదటి ప్రయత్నంలో ఏకంగా ఐఎఫ్‌ఎస్‌ సాధించడం కాలేజీకి గర్వకారణమని తెలిపింది. జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ కాలేజీని ఏర్పాటుచేశారని వివరించింది. తాను ర్యాంకు సాధించడానికి సహకరించిన కాలేజీకి, అధికారులకు, సీఎం కేసీఆర్‌కు రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.