* మొత్తం 5 ప్రకటనల పోస్టులకు రాత పరీక్షల షెడ్యూలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి.. అయిదు ఉద్యోగ ప్రకటనల్లోని పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ.. రాత పరీక్షల (కంప్యూటర్ ఆధారిత/ఓఎంఆర్) షెడ్యూలు ప్రకటించింది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ జనవరి 30న ఈ వివరాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
ఇదీ షెడ్యూలు...
* 148 వ్యవసాయ అధికారుల పోస్టులకు (ఉద్యోగ ప్రకటన: 27/2022) ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహిస్తారు.
* 18 డ్రగ్ ఇన్‌స్పెక్టరు పోస్టులకు (ప్రకటన: 21/2022) మే 7న
* 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు (ప్రకటన: 20/2022) మే 13న
* 128 సాంకేతిక, ఇంటర్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు (ప్రకటన: 26/2022) మే 17న
* 71 సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు (ప్రకటన: 30/2022) మే 17న పరీక్ష నిర్వహిస్తారు.
వ్యవసాయ అధికారుల పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు..
వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పరిపాలన కారణాలతో గడువు పెంచామని, అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ములుగు కళాశాలలో పోస్టుల భర్తీకి 6 నుంచి ఇంటర్వ్యూలు
ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.