• facebook
  • whatsapp
  • telegram

TS ICET: 8 నుంచి టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్

* రెండు విడతల కాలపట్టిక ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఐసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, కార్యదర్శి శ్రీనివాసరావు, క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్‌ రెండు విడతల కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. ఐసెట్‌ ఫలితాలు వచ్చి చాలా రోజులైనా డిగ్రీ ఫలితాలు వెలువడకపోవడం.. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నందున ఐసెట్‌ కౌన్సెలింగ్‌ పరంగా జాప్యం జరిగింది. తాజాగా కాకతీయ తప్ప మిగిలిన అన్ని వర్సిటీలు డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాలను విడుదల చేశాయని, మరో రెండు రోజుల్లో కేయూ కూడా ఫలితాలను ప్రకటిస్తుందని లింబాద్రి తెలిపారు. అక్టోబరు 28న స్పాట్‌ ప్రవేశాల మార్గదర్శకాలు ఇస్తామన్నారు. మరిన్ని వివరాలు సెప్టెంబర్‌ 27న https://icet.tsche.ac.in/  ద్వారా తెలుసుకోవచ్చు. కన్వీనర్‌ కోటా కింద గత ఏడాది 267 కళాశాలల్లో 22,797 ఎంబీఏ సీట్లు, 35 కళాశాలల్లో 1,893 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారీ గత ఏడాది మాదిరే సీట్లు ఉండొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. 

 

మొదటి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఇదీ...

* అక్టోబరు 8-12 వరకు: ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నింపి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించడం

* అక్టోబరు 10-13 వరకు: ధ్రువపత్రాల పరిశీలన

* 10-15వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్లు

* అక్టోబరు 18: సీట్ల కేటాయింపు

 

చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

* అక్టోబరు 23వ తేదీ: ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు

* 24వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన

* 23-25 వరకు: వెబ్‌ఆప్షన్లు

* అక్టోబరు 28వ తేదీ: సీట్ల కేటాయింపు

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.