‣ తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిర్ణయం
హైదరాబాద్: వచ్చే ఏడాది తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు 433 చొప్పున మొత్తంగా 3,897 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని వైద్య కళాశాలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు పోస్టులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని ఈ సందర్భంగా ఆర్థిక, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!