‣ డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టీఎఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులు భారీగా ఉన్నాయి.
ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షను ఏప్రిల్ లేదా మేలో నిర్వహించేందుకు కమిషన్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రెవెన్యూ డివిజన్ స్థాయిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా కేంద్రాలను గుర్తించాల్సి ఉంది. ఇతర పరీక్షలేమీ లేని సమయంలో గ్రూప్ 4 పరీక్షతేదీని ఖరారు చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో మే నెలలో రాతపరీక్ష నిర్వహించే వీలున్నట్లు సమాచారం.
నోటిఫికేషన్ వివరాలు కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ - వీడియో
టీఎస్పీఎస్సీ > గ్రూప్-4 > స్టడీమెటీరియల్
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!