• facebook
  • whatsapp
  • telegram

TS Police: తుది రాతపరీక్షల తేదీల్లో మార్పులు

* టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజా షెడ్యూల్‌ విడుదల 
* అవే తేదీల్లో టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలుండటంతో నిర్ణయం 

 


ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాతపరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈమేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) జనవరి 13న ఓ ప్రకటన వెలువరించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లోని కొన్ని తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) పరీక్షలూ ఉండటంతో గందరగోళం నెలకొంది. దీంతో రెండు పరీక్షలనూ రాస్తున్న అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి వినతులు వెల్లువెత్తాయి. ఈక్రమంలో పరీక్షల షెడ్యూలులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు జరిగే రోజుల్లో నిర్వహించాల్సిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పరీక్షల్లో మార్పులు చేసి వేరే తేదీల్ని ఖరారు చేశారు. మార్చి 12, ఏప్రిల్‌ 23 నాటి పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మిగిలినవి అంటే.. మార్చి 26న, ఏప్రిల్‌ 2, 8, 9 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు. మొత్తమ్మీద మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్‌ 23న ముగియాల్సిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పరీక్షలు మొదటి షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందు ఆరంభమై.. వారం తర్వాత ముగియనున్నాయి. 

 

మారిన పరీక్షల తేదీలు...

పోస్టు పరీక్ష పాత తేదీ మారిన తేదీ
ఎస్సై(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌) టెక్నికల్‌ పేపర్‌ మార్చి 12 మార్చి 11
ఏఎస్సై(ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో) టెక్నికల్‌ పేపర్‌ మార్చి 12 మార్చి 11
కానిస్టేబుల్‌(సివిల్‌/రవాణా/ఎక్సైజ్‌) జనరల్‌ స్టడీస్‌ ఏప్రిల్‌ 23 ఏప్రిల్‌ 30

కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌)

టెక్నికల్‌ పేపర్‌ ఏప్రిల్‌ 23 ఏప్రిల్‌ 30



 

 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!

‣ బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నేర్పిస్తే మనకే మంచిది!

‣ మైక్రోటాస్కింగ్‌ ప్రయత్నించండి!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?