• facebook
  • whatsapp
  • telegram

తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించిన నలుగురు అభ్యర్థులపై టీఎస్‌పీఎస్సీ నిషేధం

 

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన నలుగురు అభ్యర్థులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వేటు వేసింది. అయిదేళ్లపాటు కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా నిషేధం విధించినట్లు కమిషన్‌ కార్యదర్శి సెప్టెంబరు 20న వెల్లడించారు. టీఆర్‌టీ భాషాపండితులు- హిందీ పరీక్షలకు హాజరైన నలుగురు అభ్యర్థులు సమర్పించిన విద్యార్హత పత్రాలను సంబంధిత విశ్వవిద్యాలయాలకు పంపించగా తప్పుడువని తేలింది. దీంతో వారిపై నిబంధనల మేరకు టీఎస్‌పీఎస్సీ చర్యలు తీసుకుంది.

Posted Date : 20-09-2021