తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ విభాగాల్లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు...
* గ్రూప్ 1 పోస్టులు
మొత్తం ఖాళీలు: 503
1) మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (ఎంపీడీఓ): 121
2) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ): 91
3) కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు: 48
4) డిప్యూటీ కలెక్టర్లు: 42
5) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు: 40
6) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు: 38
7) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2: 35
8) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు: 26
9) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు: 20
10) అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ లేబర్: 08
11) డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు: 06
12) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు: 05
13) డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్లు: 05
14) డిస్ట్రిక్ రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్): 05
15) రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు: 04
16) డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు: 03
17) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు: 02
18) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్: 02
19) డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆపీసర్లు: 02
అర్హత:
1. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏవో, ఎంపీడీవో పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
2. ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
3. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవ (సోషల్ వర్క్)లో పీజీ ఉత్తీర్ణత.
4. సాంఘిక సంక్షేమ ఏడీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు.
5. సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్/ ఎకనామిక్స్/ గణితశాస్త్రం డిగ్రీల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత.
* డీఎస్పీ, ఏఈఎస్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతీ కొలత 86.3 సెం.మీ. ఉండాలి.
* మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు కలిగి ఉండాలి. హైదరాబాద్ సరోజినిదేవి, ఉస్మానియా కంటి ఆసుపత్రుల్లోని ఆఫ్తాల్మిక్ సర్జన్ ద్వారా దృష్టి పరీక్షల ధ్రువీకరణపత్రం కలిగి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.51320-రూ.137050 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమ్స్ క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* 2022 సంవత్సరానికిగానూ గ్రూప్-1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022.
దరఖాస్తులకు చివరి తేది: 31.05.2022.
ప్రిలిమ్స్ పరీక్ష: జులై/ ఆగస్టు 2022లో నిర్వహించే అవకాశం ఉంది.
మెయిన్స్ పరీక్ష: నవంబర్/ డిసెంబర్ 2022లో నిర్వహించనున్నారు.
* మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలుంటాయి. మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ( హెచ్ఎండీఏ) పరిధిలో నిర్వహిస్తారు.
‣ ఇంటర్వ్యూలు లేకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ఏప్రిల్ 25న 16వేలకు పైగా పోలీస్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 26న గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించాక తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు లేకుండా ఎంపిక చేయనున్నారు.
********************************************************
స్టడీమెటీరియల్
1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ
9. భారతదేశంలో పరిపాలన, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మినహాయింపు/ వెలి ; లింగ, కుల, తెగల, వైకల్యం మొదలైన హక్కులు, సమ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పోలీసు ఉద్యోగ పరీక్షలకు ఇదీ సిలబస్!
‣ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సిలబస్, పరీక్షావిధానం, పోస్టుల వర్గీకరణ
‣ నీట్లో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.