• facebook
  • whatsapp
  • telegram

TSPSC Jobs: మరో 24 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన

* ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకానికి నోటిఫికేషన్‌
* జులై 29 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకానికి టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు. 
 

గ్రూప్‌-1 దరఖాస్తు ఎడిట్‌ గడువు పొడిగింపు
గ్రూప్‌-1 దరఖాస్తులో వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు గడువును జులై 28 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో తొలుత ప్రకటించిన గడువులోగా (జులై 21) పలువురు అభ్యర్థులు ఎడిట్‌ చేసుకోలేకపోయారని పేర్కొన్నారు.  
 

ప్రవేశాల రిపోర్టు గడువు పొడిగింపు
ఎస్సీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సిన గడువు జులై 25 వరకు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. గడువులోగా రిపోర్టు చేయని విద్యార్థుల సీట్లు రద్దుచేసి, తదుపరి మెరిట్‌ కలిగిన వారికి కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికేట్లను దాఖలు చేసి.. ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.
 

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.