* జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహణ
హైదరాబాద్: గ్రూప్-1 ప్రధాన పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 2,86,051 అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
పరీక్ష తేదీ | సబ్జెక్టు |
జూన్ 5 | జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ టెస్ట్) |
జూన్ 6 | పేపర్-1(జనరల్ ఎస్సే) |
జూన్ 7 | పేపర్-2(హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ) |
జూన్ 8 | పేపర్-3(ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిస్ట్యూషన్ అండ్ గవర్నెన్స్) |
జూన్ 9 | పేపర్-4(ఎకానమీ, డెవలప్‌మెంట్) |
జూన్ 10 | పేపర్-5(సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్) |
జూన్ 12 | పేపర్-6(తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్) |
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్‌గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.