* కంప్యూటర్ ఆధారితం (సీబీఆర్‌టీ)గా నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్(టీపీబీవో), పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టుల భర్తీకి రీషెడ్యూలు చేసిన రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గతంలో టీపీబీవో పరీక్షకు రెండ్రోజుల ముందు కంప్యూటర్లు హ్యాక్‌కు గురైనట్లు కమిషన్ గుర్తించింది. ఈ విచారణలో పలు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడైంది. ఈ కారణంగా పలురాత పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజా షెడ్యూల్ ప్రకారం జులై 8న టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను జులై 13న ఉదయం, మధ్యాహ్నం, 14న ఉదయం కంప్యూటర్ ఆధారితం (సీబీఆర్‌టీ)గా నిర్వహించన్నుట్లు వెల్లడించింది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 60 శాతం హాజరు
రాష్ట్రంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మే 19న జరిగిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు 60శాతం హాజరు నమోదైంది. మొత్తం 18 పోస్టులకు 17,789 మంది దరఖాస్తు చేయగా 15,240 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం జరిగిన పేపర్-1 10,760 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 10,704 మంది రాశారని వివరించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2023 ఫలితాలు
‣ మెడికల్ డివైజెస్ కోర్సులకు డిమాండ్
‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్
‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!
‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.