• facebook
  • whatsapp
  • telegram

TSRTC: మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో... కుటుంబ సభ్యులకు ఉద్యోగం

* ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలోని భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధిని కల్పించే ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ‌స్టు 9న‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో జరిగిన ప్రమాదం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాత వివిధ వైద్య కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలగిన వారి కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారు. మూడేళ్లపాటు ఏకమొత్తం చెల్లింపు ప్రాతిపదికన గ్రేడ్‌-2 డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టుల్లో వారిని నియమిస్తారు.  మూడేళ్ల సర్వీసు పూర్తి తరవాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.