• facebook
  • whatsapp
  • telegram

UGC NET: యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

 

నేషనల్‌ టెస్టింగ్‌ ఆధ్వర్యంలోని నిర్వహించనున్న యూజీసీ నెట్‌ డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షల తేదీలను బోర్డు ఖరారు చేసింది. యూజీసీ నెట్‌ డిసెంబర్ 2020 పరీక్షను 20, 21, 22, 24, 25, 26, 29, 30 నవంబర్ 2021 తేదీల్లో జరుపనున్నారు. యూజీసీ నెట్‌ జూన్ 2021 ప్రకటనకు సంబంధించిన పరీక్షను 1, 3, 4, 5 డిసెంబరు 2021 రోజుల్లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో తెలిపిన విధంగా అక్టోబరులో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అదే నెలలో ఇతర రాష్ట్ర, జాతీయ పరీక్షలు ఉండడంతో ఉద్యోగార్థుల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు బోర్డు తెలిపింది. దాంతో వాటిని వాయిదా వేసి కొత్త తేదీలు ప్రకటించింది. 

 

ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారు జాతీయ విశ్వవిద్యాలయాలు వెలువరించే జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు.

Posted Date : 25-10-2021