• facebook
  • whatsapp
  • telegram

యూకే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఛెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌లకు విద్యార్థుల నుంచి యూకే ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో ఏడాది మాస్టర్‌ డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు నవంబరు 2 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు రెండేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలన్నారు.

Posted Date : 04-08-2021