• facebook
  • whatsapp
  • telegram

Montessori School: విజయవాడ మాంటిస్సోరి పాఠశాల మూత

ఎయిడెడ్‌పై ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఉన్నత ఆశయానికి చరమగీతం

ఈనాడు, అమరావతి: స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే గొప్ప లక్ష్యంతో విజయవాడలో 67 ఏళ్ల క్రితం స్థాపించిన మాంటిస్సోరి ఉన్నత పాఠశాల మూతపడింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రఖ్యాత విద్యా సంస్థ పయనం ఆగిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న 13 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకున్నందున పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణóుంచింది. టీసీలు తీసుకొని వెంçనే సమీపంలోని పాఠశాలల్లో చేరాలని విద్యార్థులకు సూచించింది. మహిళా అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్‌ కోటేశ్వరమ్మ, కృష్ణారావు దంపతులు 1954లో మాంటిస్సోరి విద్యా సంస్థలను ప్రారంభించారు. ప్రభుత్వం గ్రాంటు ఇస్తుండడంతో తక్కువ ఫీజులతోనే వాటిని నిర్వహించారు. ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఇక్కడ చదువుకుని ప్రయోజకులయ్యారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం 8, 9, 10 తరగతుల్లో చదువుతున్న 450 మంది వరకు విద్యార్థులంతా వేరే పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మూతపడుతున్న మొదటి ఎయిడెడ్‌ పాఠశాల ఇదే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 1,972 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 1,97,291 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Posted Date : 24-09-2021