• facebook
  • whatsapp
  • telegram

Wellington College: భార‌త్‌లో వెల్లింగ్టన్ కళాశాల స్కూల్స్   

లండన్: యూకేలోని వెల్లింగ్టన్ కాలేజ్ ఇంటర్నేషనల్ భారతదేశంలో ప్రైమ‌రీ పాఠశాలలను ప్రారంభించడానికి యూనిసన్ గ్రూపుతో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుంది. మొదటి పాఠశాల 2023 లో పూణేలో ప్రారంభమవుతుంది. ఇది పూణే కోడ్యుకేషనల్ డే, బోర్డింగ్ స్కూల్‌గా ఏర్పాటు కానుంది. ఇందులో 2 నుంచి 18 ఏళ్ల పిల్ల‌లు చ‌దువుకోవ‌చ్చు.
ప్రస్తుతం చైనా, థాయ్‌లాండ్‌లో డబ్ల్యుసీఐకి చెందిన‌ ఆరు పాఠశాలలు ఉన్నాయి. ఇక్క‌డ 5,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. డబ్ల్యుసీఐ అనేది ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలల సమూహం. ఇది 1853 లో బ్రిటిష్ రాయల్ చార్టర్ కింద ఏర్పాటైన‌ ది వెల్లింగ్టన్ కాలేజ్ కి చెందిన‌ అనుబంధ సంస్థ, యు.కె.లో ప్ర‌ముఖ‌ డే అండ్ బోర్డింగ్ స్కూల్.

Posted Date : 28-09-2021