• facebook
  • whatsapp
  • telegram

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీ తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడి (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన నిబంధనలు జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అంటే రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 1061 బోధనా సిబ్బంది (సహాయ, సహ ఆచార్యులు, ఆచార్యులు) నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాటికి పోటీపడాలంటే పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండటం తప్పనిసరి అవుతోంది. ఈ నిబంధనతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1300 మంది ఒప్పంద అధ్యాకుల్లో సుమారు 50 శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోతారని అంచనా. 1061 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినా.. ఉమ్మడి వడపోత పరీక్ష నిర్వహించినా 6 వేల మంది పోటీపడవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.