• facebook
  • whatsapp
  • telegram

IIT: డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లకు ప్రత్యేక కళాశాల

ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో 2022లో ప్రారంభం

డేటా సైన్స్, కృత్రిమ మేదస్సు రంగాలలో నిపుణుల‌ను పెంపొందించే లక్ష్యంతో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క‌ళాశాలను ఐఐటీ రూర్కీ ఏర్పాటు చేయ‌నుంది. ఇందులో బ్యాచిలర్స్‌, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. సెప్టెంబరు 2022లో మొదటి బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులతో దీన్ని ప్రారంభిస్తారు. ఈ క‌ళాశాల‌ను యుఎస్ లోని మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎఫ్ఎఫ్) సహకారంతో స్థాపిస్తున్నారు.

Posted Date : 28-09-2021