• facebook
  • whatsapp
  • telegram

ఐసీఏఆర్‌ పరీక్షలతోనే వ్యవసాయ పీజీలో ప్రవేశాలు


 

గుంటూరు (జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2021-22 విద్యా సంవత్సరానికి వ్యవసాయ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించడం లేదని వర్శిటీ రిజిస్ట్రార్‌ గిరిధరకృష్ణ జులై 28న‌ ఓ ప్రకటనలో తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) నిర్వహించే ప్రవేశపరీక్షల ఫలితాల్లో ర్యాంకులను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఈ (పీజీ), ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలను సాధించి వర్శిటీలో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రకటన త్వరలో జారీ చేస్తామని, వివరాలకు www.angrau.ac.in ని చూడాలని కోరారు.

Posted Date : 29-07-2021