• facebook
  • whatsapp
  • telegram

డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌ 31 నుంచి 

 

ఈనాడు, అమరావతి: డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ)లో ప్రవేశాలకు జులై 31 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని కన్వీనర్‌ రవీంద్రనాథరెడ్డి తెలిపారు. డీఈఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న కొన్ని కళాశాలల అనుమతులను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. దీంతో ఆ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ఇప్పుడు కౌన్సెలింగ్‌ చేపట్టారు. విద్యార్థుల సెల్‌ఫోన్లకు జులై 30న సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. కళాశాలల ఎంపికకు 31 నుంచి ఆగస్టు 4వరకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి. మొదటి విడతలో సీటు పొందిన వారు మరో కళాశాలకు వెళ్లాలనుకున్నా ఈ సమయంలోనే ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 9 వరకు సీట్ల కేటాయింపు చేస్తారు. 

Posted Date : 29-07-2021