• facebook
  • whatsapp
  • telegram

సైనిక్ పాఠ‌శాల ప్ర‌వేశాలకు తుది జాబితా విడుద‌ల‌

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌లికిరి సైనిక్ పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల తుది జాబితా విడుద‌లైంది. 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ఆరు, తొమ్మిదో త‌ర‌గ‌తిలో బాల‌బాలిక‌ల‌కు ప్ర‌వేశాల కోసం ఎన్‌టీఏ దేశ‌వ్యాప్తంగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌ను ఫిబ్ర‌వ‌రి 7, 2021న నిర్వ‌హించింది. ఈమేర‌కు విద్యార్థులు అందులో సాధించిన మార్కులతోపాటు మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించారు. ఎంపికైన విద్యార్థుల హాల్‌టికెట్ నంబ‌ర్ల‌ను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. త్వ‌ర‌లో విద్యార్థులకు ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వెబ్‌సైట్‌: https://sskal.ac.in/