• facebook
  • whatsapp
  • telegram

సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులందరూ పాస్‌ 

 

 

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటరు పరీక్షలను రద్దు చేసినందున విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు, మార్కులను ప్రకటించాలని సూచించింది. రెగ్యులర్‌ పది, ఇంటర్‌ విద్యార్థుల మార్కుల కేటాయింపునకు ఉన్నతసాయి కమిటీ చేసిన సిఫార్సులనే అనుసరించాలని పేర్కొంది. ఈ నిర్ణయంతో పదో తరగతిలో 50,224, ఇంటర్‌లో 63,969 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  

Posted Date : 03-08-2021