• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 16-10-2021 (తెలుగు)

1.  విజయవంతంగా ‘లూసీ’ వ్యోమనౌక ప్రయోగం 

సౌర కుటుంబంలోని 8 గ్రహశకలాల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ‘లూసీ’ అనే వ్యోమనౌకను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఇది 12 ఏళ్ల పాటు ఏకంగా 630 కోట్ల కిలోమీటర్ల ప్రయాణించి, పరిశోధనలు సాగిస్తుంది. తద్వారా సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావం గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 98.1 కోట్ల డాలర్లను నాసా వెచ్చించింది.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2. రత్నాభరణాల ఎగుమతుల్లో 29% వృద్ధి

భారత రత్నాభరణాల ఎగుమతులు సెప్టెంబరులో 29.67% వృద్ధితో రూ.23,259.55 కోట్లకు చేరాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) ప్రకటించింది. 2019 సెప్టెంబరులో వీటి విలువ రూ.23,491.20 కోట్లుగా ఉన్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3. విశాఖ మహిళకు ‘డెంటన్స్‌’లో కీలక పదవి 

ప్రపంచంలో అతిపెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన ‘డెంటన్స్‌’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా విశాఖకు చెందిన నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ తరహా కంపెనీలో గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా పదవి దక్కడం ఇదే తొలిసారి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4. చైనాలో ‘బాయ్‌కాట్‌ 996’ ఉద్యమం

చైనాలో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్‌ ఉద్యోగులంతా.. ‘996’ పద్ధతికి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ ఉద్యమం ప్రారంభించారు. ఓవర్‌ టైం పనివేళలు, వీక్‌ ఆఫ్స్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పనిచేస్తున్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేస్‌ను ఏర్పాటుచేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5. ఐపీఎల్‌ 2021 ఛాంపియన్‌గా చెన్నై జట్టు

ఐపీఎల్‌ 2021 ఛాంపియన్‌గా ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ఎప్పటిలా సమర్థంగా నడిపించాడు ధోని. జట్టు విజేతగా నిలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు యువ రుతురాజ్‌ గైక్వాడ్, అనుభవజ్ఞుడైన డుప్లెసిస్‌. టోర్నీ టాప్‌ స్కోరర్లలో వీళ్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 17-10-2021