జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ వర్గాలు జులై 1న ఓ ప్రకటనలో తెలిపాయి. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకొనేవారు వివరాలను www.braouonline.in, www.braou.ac.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు రెండో సంవత్సరం ట్యూషన్ రుసుం, అంతకు ముందు చేరి సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు జులై 31లోగా ఆన్లైన్లో చెల్లించాలన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ
‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు
‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.