• facebook
  • whatsapp
  • telegram

Court Master: 65 కోర్టు మాస్టర్‌ పోస్టులకు హైకోర్టు నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్‌లకు వ్యక్తిగత కార్యదర్శులు, కోర్టు మాస్టర్‌ పోస్టుల నిమిత్తం ఇటీవల తెలంగాణ‌ హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 65 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటన జారీ చేశారు. ఓసీలకు 29 పోస్టులు కేటాయించగా ఇందులో 8 స్త్రీలకు, 4 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, 3 ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు కేటాయించారు. మిగిలిన పోస్టుల్లో ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, బీసీ వర్గాలకు 17, పాక్షిక దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి రిజర్వేషన్‌లు కేటాయించారు. డిగ్రీతోపాటు షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ల్లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానంతోపాటు దరఖాస్తు నమూనా హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

‣ టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

‣ సౌకర్యంగా లాపీస్టాండ్‌

‣ కోల్‌ ఇండియాలో కొలువులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.