• facebook
  • whatsapp
  • telegram

AP ICET Results 2022: ఏపీ ఐసెట్‌-2022 ఫలితాలు విడుదల

 

 

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎం.బి.ఎ, ఎం.సి.ఎ. కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో ఆగ‌స్టు 8న‌ సాయంత్రం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 87.83 శాతం అర్హత సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో యువకులు ఏడు ర్యాంకులు, యువతులు మూడు ర్యాంకులు సాధించారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి ఖేతన్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, గుంటూరుకు చెందిన డి.పూజిత వర్థన్‌ రెండో ర్యాంకు, శ్రీకాకుళానికి చెందిన ఎన్‌.వంశీ భరద్వాజ్‌ మూడో  ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు, సహ కన్వీనర్‌ ఆచార్య భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఫలితాలు
 

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.