• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 09-08-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు కంచు పతకాలు

44వ చెస్‌ ఒలింపియాడ్‌ను భారత్‌ రెండు కంచు పతకాలతో ముగించింది. మహిళల-1, పురుషుల-2 జట్లు పోడియంపై నిలిచాయి. చివరిదైన 11వ రౌండ్లో మహిళల-1 జట్టు కంచు పతకం సాధించింది. పదో రౌండ్‌ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల-1 జట్టు చివరిదైన 11వ రౌండ్లో 1-3తో అమెరికా చేతిలో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. మహారాష్ట్రలో మంత్రివర్గం విస్తరణ

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 18 మందికి అందులో చోటుకల్పించారు. వారిలో తొమ్మిది మంది తన నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గానికి చెందినవారు కాగా.. మిగిలినవారంతా భాజపా నాయకులు. తాజా విస్తరణతో కేబినెట్‌లో సభ్యుల సంఖ్య 20కి చేరుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. సింగపూర్‌లో జాతీయ స్మారకంగా నేతాజీ ‘దిల్లీ చలో’ మైదానం

రెండు శతాబ్దాలుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచి.. సింగపూర్‌ నగర నడిబొడ్డున 11 ఎకరాల్లో వెలసిన పచ్చిక మైదానాన్ని 75వ జాతీయ స్మారకంగా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కవాతు అనంతరం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే మైదానం నుంచి ‘దిల్లీ చలో’ నినాదమిచ్చారు. స్థానికులకు క్రీడామైదానంగానూ ఇది ఉపయోగపడుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ‘మెట్రో’ నిర్మాణ కష్టాలకు అక్షరరూపం ‘మేఘపథం’ 

మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి రచించిన 58 దీర్ఘ కవితల సంకలనం ‘మేఘపథం.. మెట్రో కవితా ఝరి’ పుస్తకాన్ని జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో  తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్‌.గోపి ఆవిష్కరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఆగస్టు 25న దిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్‌ కాన్‌క్లేవ్‌- 2022’లో ఈ పురస్కారం అందజేయనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.