• facebook
  • whatsapp
  • telegram

CUET Exam: నాలుగో విడత ‘సీయూఈటీ-యూజీ’ పరీక్ష వాయిదా

 

దిల్లీ: దేశంలో నాలుగో విడతగా 11 వేల మంది విద్యార్థులు రాసే కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ)ని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు ఆగస్టు 13న తెలిపారు. వారి ఐచ్ఛికాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను (నగరాలను) ఎంపిక చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ పరీక్షలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఈమేరకు పరీక్షా కేంద్రాలను పెంచినట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. రెండో దశలో నిర్వహించిన పరీక్షలో పలు సమస్యలు ఎదురు కావడంతో అనేక కేంద్రాల్లో ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసింది. అలాంటివారంతా ఆగస్టు 30న పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.