• facebook
  • whatsapp
  • telegram

Latest News: 29-09-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC: 269 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు

ఈనాడు, అమరావతి: 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ సెప్టెంబ‌రు 28న‌ 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలనూ ప్రకటించింది. 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్స్‌, మూడు ఆయుర్వేద లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. APPSC: గ్రూపు-1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం మౌఖిక పరీక్షలను తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆ ప్రక్రియ నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Inter: వెబ్‌సైట్‌లో ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మార్కుల కోసం రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. IIIT: 29న‌ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల

ఈనాడు, అమరావతి: ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక విద్యార్థుల జాబితాను సెప్టెంబ‌రు 29న‌ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. TSPSC: ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో మరో 4 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో 833 సహాయ ఇంజినీర్‌, మున్సిపల్‌ సహాయ ఇంజినీరింగ్‌, టెక్నికల్‌ అధికారులు, జూనియర్‌ టెక్నికల్‌ అధికారుల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌(16/2022)లో మరో నాలుగు పోస్టులను టీఎస్‌పీఎస్సీ చేర్చింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.