• facebook
  • whatsapp
  • telegram

AP Jobs: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2 నియామకాలు ఆపండి: ఏపీ హైకోర్టు

అమరావతి: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 560 గ్రేడ్‌-2 పోస్టుల నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్‌వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలెక్ట్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌ వాదనలు వినిపించారు. వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే, రాత పరీక్షను సెప్టెంబర్‌ 18న అధికారులు నిర్వహించారని, మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భర్తీల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.