• facebook
  • whatsapp
  • telegram

UGC: నిర్దేశిత విద్యార్హతలు లేకున్నా ప్రొఫెసర్‌

* యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొత్త మార్గదర్శకాలు

 

ఈనాడు, దిల్లీ: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రొఫెసర్ల నియామకానికి అర్హతలను సడలించింది. ఇదివరకటిలా కేవలం నిర్దేశిత విద్యార్హతలు ఉన్నవారినే కాకుండా వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని ప్రొఫెసర్లుగా నియమించుకోవడానికి అనుమతిస్తూ సెప్టెంబ‌రు 30న‌ మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్యలో పరిశ్రమ-విద్యారంగం మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీష్‌కుమార్‌ పేర్కొన్నారు ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌’ పేరుతో కొత్తవారిని బోధకులుగా తీసుకోవడంవల్ల తరగతులకు అనుభవపూర్వకమైన నైపుణ్యం రావడంతోపాటు, ఉన్నత విద్యాసంస్థల్లో బోధనాసిబ్బంది కొరతను నివారించడానికి వీలవుతుందనేది యూజీసీ ఉద్దేశం.

* విద్యార్హతలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌, సాంకేతికం, పరిశ్రమలు, వాణిజ్యం, సామాజికశాస్త్రం, మీడియా, సాహిత్యం, లలితకళలు, సివిల్‌ సర్వీసెస్‌, సాయుధ దళాలు తదితర రంగాల్లో విశిష్టమైన నైపుణ్యం, విస్తృత అనుభవం (కనీసం 15 ఏళ్లు) ఉన్న వారిని ప్రొఫెసర్లుగా తీసుకోవచ్చు. అయితే వీరిసంఖ్య ఉన్నత విద్యాసంస్థలకు మంజూరుచేసిన పోస్టుల్లో 10%కి మించకూడదు.

* ఈ ప్రొఫెసర్లను కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పనలో భాగస్వాములుగా చేయొచ్చు. యూనివర్సిటీ, కాలేజీలకు మంజూరుచేసిన పోస్టులకు అతీతంగా వీరి నియామకం జరుగుతుంది. అందువల్ల అధికారికంగా మంజూరుచేసిన పోస్టులపై ఎలాంటి ప్రభావం చూపదు. గౌరవవేతనం ఎంత చెల్లించాలన్నది ఉన్నత విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చు.

* ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌’కు గరిష్ఠంగా మూడేళ్లకు మించి అవకాశం ఇవ్వకూడదు. అరుదైన కేసుల్లో ఏడాది పొడిగించవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి సర్వీసు నాలుగేళ్లకు మించకూడదు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.