• facebook
  • whatsapp
  • telegram

Latest News: 01-12-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. IT Jobs: శామ్‌సంగ్‌ ఇండియాలో 1,000 నియామకాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల కోసం 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, దిల్లీలోని ఆర్‌అండ్‌డీ కేంద్రాల్లో, బెంగళూరులోని శామ్‌సంగ్‌ సెమీకండక్టర్‌ ఇండియా రీసెర్చ్‌లో కొత్త తరం సాంకేతికతలపై పనిచేసేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా మానవ వనరుల.......

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

2.  UGC: ఇక నేరుగా యూజీసీకే ‘అటానమస్‌’ దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ కళాశాలలకు యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే ప్రక్రియలో విశ్వవిద్యాలయాల పెత్తనానికి యూజీసీ కోత పెడుతోంది. ఇప్పటివరకు ఆయా కళాశాలలు అటానమస్‌ హోదా దరఖాస్తును  విశ్వవిద్యాలయం ద్వారానే యూజీసీకి పంపించాల్సి ఉండేది. మొదట వర్సిటీ కమిటీ.. కళాశాలను తనిఖీ చేసి...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

3. Nursing Seats: 7 వరకూ ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్యవర్సిటీ న‌వంబ‌రు 30న‌ ప్రకటన విడుదల చేసింది. డిసెంబ‌రు 1న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

4. AP Inter: ఉచిత పాఠ్య పుస్తకాలు ఇక లేనట్లే?

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు నిధులు లేవంటూ చెప్పిన ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ.. పాఠశాల విద్యలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్‌ ప్లస్‌లోని వారికి ఇచ్చేందుకు నిధులిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

5. AP LAWCET: 3 నుంచి ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్‌ను 3 నుంచి ప్రారంభించనున్నామని కన్వీనర్‌ నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ డిసెంబరు 3-10, ధ్రువపత్రాల పరిశీలన 4-12, వెబ్‌ ఐచ్ఛికాల నమోదు 13-15, సీట్ల కేటాయింపు 16న చేయనున్నట్లు వెల్లడించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.