* 15 రోజుల్లో భర్తీకి తమిళనాడు సర్కారుకు సుప్రీం ఆదేశం
దిల్లీ: నీట్లో ఉత్తీర్ణులైన ఇన్-సర్వీస్ డాక్టర్లకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50% సూపర్ స్పెషాలిటీ సీట్ల కేటాయింపునకు తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. 2020 నవంబరు 7న జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి వర్తించేలా ఈ సీట్లను 15 రోజుల్లో భర్తీ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రంనాథ్ల ధర్మాసనం డిసెంబర్ 2న ఆదేశాలు జారీ చేసింది. ‘అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తన వాదనలో.. ఇన్-సర్వీస్ అభ్యర్థులకు గతేడాది కేటాయించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదని, విలువైన జాతి సంపద లాంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు వృథా కాకూడదని తెలిపారు. ఆందోళనతో కూడిన ఈ వైఖరిని మేము అభినందిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 15 రోజుల భర్తీ ప్రక్రియ అనంతరం.. ఇన్-సర్వీస్ అభ్యర్థుల మిగులు సీట్ల వివరాలను తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలని సూచించింది. మిగులు సీట్లను ఆలిండియా మెరిట్‌లిస్టు ప్రకారం కేంద్రం కేటాయించవచ్చని పేర్కొన్న ధర్మాసనం పూర్తిస్థాయి విచారణకు ఈ కేసును 2023 ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకేసారి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?
‣ ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నెగ్గేదెలా?
‣ టెన్త్‌తో రక్షణదళంలో ఉద్యోగం
‣ డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్ల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.