1. అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!
పోలీసు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఒక ప్రశ్నకు సంబంధించి ఏపీ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన ‘కీ’లలో సమాధానాలను ఒక్కోసారి ఒక్కోలా పేర్కొనడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో పొరుగుసేవల ప్రాతిపదికన 10 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక శాస్త్రానికి సంబంధించి 3, రసాయన శాస్త్రం 2, జీవ శాస్త్రానికి సంబంధించి 5 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జేఈఈ తొలి విడత ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్ సాధించిన 20 మంది వారిలో నలుగురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
ఎంబీబీఎస్ అభ్యర్థులకు శుభవార్త. నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు వర్సిటీ ఫిబ్రవరి 7న ఒక ప్రకటనలో పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. నకిలీ పట్టాలకు డిజిటల్ చెక్
ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ ధ్రువపత్రాలను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందరి విద్యార్హత పత్రాలను డిజీ లాకర్‌లో నిక్షిప్తం చేయాలంటూ యూజీసీ ద్వారా అన్ని వర్సిటీలను ఆదేశించింది. ఆ లాకర్ల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.