• facebook
  • whatsapp
  • telegram

రాజోర్‌పేలో 650 ఉద్యోగాలు  

ఆర్థిక సాంకేతిక సేవల సంస్థ‌ రాజోర్‌పే 650కి పైగా నియామకాలు చేపట్టనుంది. ఈ యూనికార్న్‌(100 కోట్ల డాలర్లకుపైగా టర్నోవరు ఉన్న కంపెనీ) 2020లో మూడింతల వ్యాపార వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటికే 50 లక్షల వ్యాపారాలకు సేవలందిస్తుండగా.. 2022 కల్లా మరో 50 లక్షల వ్యాపారాలకు సేవలు అందించేందుకు నూతన నియామాకాలు చేపడుతోంది. ద టైగర్‌ గ్లోబల్, సెక్వాయో మద్దతున్న ఈ కంపెనీ ఇంజినీరింగ్, ప్రోడక్ట్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, విక్రయాలు, మార్కెటింగ్‌ బృందాలను అన్ని విభాగాల్లోనూ విస్తరించనుంది. 

Posted Date : 13-02-2021