• facebook
  • whatsapp
  • telegram

సైనిక్ స్కూల్ ‘కీ’ పై అభ్యంత‌రాల‌కు అవ‌కాశం

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ) 2021 జవాబు కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) మార్చి 4న‌ విడుదల చేసింది. ఈ ప‌రీక్ష‌ ఫిబ్రవరి 7న జరిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు aissee.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఓఎంఆర్‌ జవాబు పత్రాలను, వారు రికార్డ్ చేసిన ప్రతిస్పందనలను తనిఖీ చేసుకునేందుకు ఎన్‌టీఏ అవ‌కాశం క‌ల్పించింది. విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ లేదా ద‌ర‌ఖాస్తు సంఖ్య‌, పాస్‌వ‌ర్డ్ ఆధారంగా కీ త‌నిఖీ చేసుకోవ‌చ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించాలి. అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసేందుకు అద‌నంగా ప్ర‌తి ప్ర‌శ్న‌కు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి లేవ‌నెత్తిన అభ్యంత‌రాలు స‌రైన‌వి అయితే ఎన్‌టీఏ మార్పులు చేసి తుది కీ రూపొందించి ఫ‌లితాలు విడుద‌ల చేస్తుంది.  

 

జవాబు ‘కీ’ని తనిఖీ చేయడానికి, అభ్యంతరాలను పంచుకోవ‌డానికి క్లిక్ చేయండి

Posted Date : 07-03-2021