• facebook
  • whatsapp
  • telegram

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల పెంపు

ఈనాడు, అమ‌రావ‌తి: ప్రైవేటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో సీట్లను పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు ఎంసీఏ, ఒక ఎంబీఏ కళాశాలలో గతంలో 60 సీట్లు చొప్పున ఉండగా.. వీటిని 120కి పెంచారు. మరో ఎంబీఏ కళాశాలలో 180 సీట్లు ఉండగా వీటిని 240కి పెంచారు. చిత్తూరులో ప్రైవేటు కళాశాలకు అదనపు కోర్సులను మంజూరు చేశారు. ఎంబీఏలో బిగ్‌డాటా అనాలసిస్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అనుమతించారు. నెల్లూరులో కొత్తగా ఎంబీఏ కళాశాలకు అనుమతి తెలిపారు.

Posted Date : 13-03-2021