• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ విద్యార్థులకు కామిక్ పుస్తకాలు

 విడుదల చేసిన కేంద్ర మంత్రి

ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా 3 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం వివిధ అంశాలపై రూపొందించిన కామిక్ పుస్తకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మార్చి 24న విడుదల చేశారు. ఈ పుస్తకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తయారు చేసింది. విషయపరిజ్ఞానం పెంచుకుంటూ మరింత ఆహ్లాదకరంగా ఉండటానికి ఇవి సహాయపడతాయని ఈ సందర్భంగా సీబీఎస్ఈ తెలిపింది. వీటిలో వ‌ర్క్‌షిట్ల‌ను పొందుపరిచారు. విద్యార్థుల్లో అంతరాలను తగ్గించే లక్ష్యంతో లింగ సమానత్వం, మహిళా సాధికారతపై అవగాహన కలిగించే విధంగా వీటిని రూపొందించామని పేర్కొంది. అనంతరం సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ లకు సంబంధించిన సీబీఎస్ఈ అసెస్మెంట్ ఫ్రేమ్‌వ‌ర్క్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ అసెస్మెంట్ ఫ్రేమ్‌వ‌ర్క్‌ను సీబీఎస్ఈ, బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల ఆధారంగా నూతన జాతీయ విద్యా విధానం-2020 కు అనుగుణంగా దీన్ని తయారుచేశామన్నారు. 6 నుంచి 10 తరగతుల్లో సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ పాఠ్యాంశాల ప్రమాణాలను మెరుగుపరచడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు.

Posted Date : 26-03-2021