• facebook
  • whatsapp
  • telegram

సిల‌బ‌స్ త‌గ్గింపు ఉండ‌దు: సీబీఎస్ఈ

దిల్లీ: క‌రోనా వైర‌స్ విస్తృతి కార‌ణంగా గత ఏడాది 9 నుంచి 12 తర‌గ‌తుల వ‌రకు త‌గ్గించిన సిల‌బ‌స్‌ను 2021-22లో పున‌రుద్ధ‌రిస్తున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. కొవిడ్ వ‌ల్ల  నెల‌ల త‌ర‌బ‌డి పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డంతో 2020-21 విద్యా సంవ‌త్స‌రంలో బోర్డు 30 శాతం వ‌ర‌కు సిల‌బ‌స్‌ను తొల‌గించింది. దానిక‌నుగుణంగానే మే, జూన్ నెలల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించనుంది. కొత్త విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌క‌టించిన బోధ‌న ప్ర‌ణాళిక ప్ర‌కారం సిల‌బ‌స్ త‌గ్గింపు ఏమీ ఉండద‌ని సీబీఎస్ఈ స్ప‌ష్టం చేసింది.

Posted Date : 03-04-2021