• facebook
  • whatsapp
  • telegram

ఎస్సీ గురుకుల పీజీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

* ఏప్రిల్ 16న నిర్వ‌హ‌ణ‌

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పీజీ కళాశాలల్లో 2020-21 ఏడాదికి ఖాళీగా మిగిలిన సీట్లకు ఏప్రిల్‌ 16న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ తెలిపింది. ఎంకామ్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎంఏ ఆంగ్లంలో సీట్లు ఖాళీగా ఉన్నాయంది. పూర్తి వివరాలకు గురుకుల వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొంది. 

Posted Date : 08-04-2021