• facebook
  • whatsapp
  • telegram

ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వ్వండి: సీబీఎస్ఈ

 

విద్యార్థులు ప‌రీక్షల ర‌ద్దుకు సంబంధించి ఎలాంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, స‌న్న‌ద్ధంపైనే దృష్టి సారించాలని సీబీఎస్ఈ స్ప‌ష్టం చేసింది. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సీబీఎస్ఈ ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌రీక్ష‌లు పూర్త‌య్యేవ‌ర‌కు సీబీఎస్ఈ విద్యార్థుల వెంటే ఉంటుంద‌ని బోర్డు కంట్రోల‌ర్ డా.స‌న్యం భ‌ర‌ద్వాజ్ వివ‌రించారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈసారి ప‌రీక్ష కేంద్రాల‌ను పెంచామ‌ని, కొవిడ్ నిబంధ‌న‌లు ప‌క్కాగా అమలు చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు విద్యార్థుల త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల స‌హ‌కారం ఎంతో అవస‌ర‌మ‌ని అన్నారు. ఈసారి విద్యార్థులు స‌న్న‌ద్ధం అవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ల‌భించినందుకు గ‌తేడాది విద్యార్థుల కంటే బాగా ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం ఉంద‌ని భ‌ర‌ద్వాజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రోవైపు ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభంలో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఈమేర‌కు ఆమె కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్‌కు రాసిన లేఖ‌ను ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. 

Posted Date : 11-04-2021