• facebook
  • whatsapp
  • telegram

 మేలో ఎస్ఎస్‌సీ  కానిస్టేబుల్స్ ప్రకటన

‘ఎస్ఎస్‌సీ జ‌న‌ర‌ల్ డ్యూటీ(జీడీ) కానిస్టేబుల్‌-2021’ నోటిఫికేష‌న్‌ మే మొద‌టి వారంలో విడుద‌లకానుంది. ఈ విష‌యాన్ని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) ఇటీవ‌ల‌ త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. షెడ్యూల్ ప్ర‌కారం ఇది‌ మార్చి 25న వెలువ‌డాల్సి ఉంది. కానీ, అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ మే నెల‌కు వాయిదా వేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సెంట్ర‌ల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌)లో కానిస్టేబుల్ (జీడీ), ఎన్ఐఏ, సెక్ర‌టేరియంట్ సెక్యురిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌), అసోం రైఫెల్స్‌లో రైఫెల్‌మెన్‌(జీడీ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Posted Date : 12-04-2021