• facebook
  • whatsapp
  • telegram

పరీక్షలు లేకుండా త‌ర్వాతి సెమిస్టర్‌కు

బీటెక్‌, ఎంటెక్ ఫ‌స్టియ‌ర్‌ విద్యార్థులకు వెసులుబాటు

నిర్ణ‌యించిన‌ జేఎన్‌టీయూ

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌, బీఫార్మసీ తొలి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతానికి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుండానే రెండో సెమిస్టర్‌లోకి పంపించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఏప్రిల్‌ 15 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇదే విధానం ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తొలి ఏడాది విద్యార్థులకూ వర్తింపజేయనుంది. వీరికి ఏప్రిల్‌ 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దీనికి తగ్గట్టుగా 2020-21 విద్యా సంవత్సరాన్ని రెండు వారాలు ముందుకు జరిపింది. సవరించిన షెడ్యూల్‌ను ఏప్రిల్ 12న ప్రకటించింది. తరగతులు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. కళాశాలలు పునఃప్రారంభించాక మొదటి సెమిస్టర్‌ పరీక్షలు, ల్యాబ్‌ వర్క్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.

Posted Date : 13-04-2021